ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో నిశ్చితార్థం...ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్

SMTV Desk 2019-04-25 14:03:46  Constable, Suicide

ప్రేమ ప్రేమ ప్రేమ .. యువతలో ఇది ఒక వ్యసనం .. అయితే తాజాగా ప్రేమ కోసం ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో నిశ్చితార్థం జరగడంతో తట్టుకోలేని కానిస్టేబల్ తన సర్వీసు రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

అయితే ఈ ఘటన తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నడైక్కాపూర్ గ్రామంలో జరిగింది. నడైక్కాపూర్ గ్రామానికి చెందిన అజిన్ రాజ్ (28) అనే యువకుడు మణిముత్తారు 9వ బెటాలయన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. అజిన్ రాజు ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. అయితే అతను ప్రేమించిన యువతికి వేరే వ్యక్తితో ఇటీవల నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న అజిన్ రాజ్ మనస్తాపానికి గురై తన సర్వీసు రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శవ పరీక్ష కోసం అజిన్ రాజ్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.