కాపలాదారా లేక ఢిల్లీకి చక్రవర్తా?

SMTV Desk 2019-04-24 15:50:31  priyanka gandhi, congress party, bjp, narendra modi, loksabha elections

ఫతేపూర్‌: లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ప్రధానధ్యక్షురాలు ప్రియాంక గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. ఫతేపూర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక మోదీపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బందాలో మోడీకి స్వాగతం పలికేందుకు తాగునీటిని రోడ్లపాలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కాపలాదారా లేక ఢిల్లీ నుంచి వస్తున్న చక్రవర్తా? అని ప్రశ్నించారు ప్రియాంక. బుందేల్‌ఖండ్‌ ప్రజలు ఓ వైపు తీవ్ర దుర్భిక్షంతో అల్లాడుతుంటే.. మరోవైపు ప్రధాని కోసం తాగునీటిని పారబోయడమేంటని నిలదీశారు.