నాగార్జునని బీట్ చేసిన నాగ చైతన్య

SMTV Desk 2019-04-23 17:12:41  Majili, Nagarjuna

అందం, అభినయంలోనూ తనయులు నాగ చైతన్య, అఖిల్ కంటే ముందున్నాడు మన్మథుడు నాగార్జున. ఈ వయసులోనూ యంగ్ హీరోలతో పోటీ పడుతూ నటిస్తున్నారు. మరీ.. ముఖ్యంగా కొడుకుల సినిమాలని మించి కలెక్షన్స్ రాబడుతోంది. నాగ్ సోగ్గాడే చిన్ని నాయన సినిమా నైజాం ఏరియాల్లో 18 రోజుల్లో రూ 12.5 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఇప్పుడీ కలెక్షన్స్ ని మజిలీ దాటేసింది. మజిలీ 18రోజుల్లో నైజాంలో రూ. 13కోట్లు కలెక్ట్ చేసింది. నైజాంలో అక్కినేని హీరోలు సాధించిన అత్యధిక కలెక్షన్స్ ఇవి.

శివ నిర్వాణ దర్శకత్వంలో మజిలీ తెరకెక్కింది. పెళ్లి తర్వాత నాగ చైతన్య-సమంత తొలిసారి నటించిన చిత్రమిది. మరోసారి సామ్ చై మేజిక్ పని చేసింది. ఇద్దరు అద్భుతమైన నటనతో ఆకట్టుకొన్నారు. ఏం మాయ చేశావె, మనం సినిమాల తర్వాత మజిలీతో అక్కినేని అభిమానులని మరోసారి మురిపించారు.