వరల్డ్ కప్ ఒదులుకొని సన్‌రైజర్స్ హైదరాబాద్ కోసం...

SMTV Desk 2019-04-23 16:56:57  shakib ali hasan, ipl 2019, sunrisers hyderabad, bangladesh cricketer, icc world cup 2019

హైదరాబాద్: బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్‌ ఈ ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆటగానికి తన క్రికెట్ బోర్డు నుండి పిలుపొచ్చింది. వరల్డ్ కప్‌కు ముందు ఐర్లాండ్‌తో పాటు ట్రై నేషన్ సిరీస్‌లో బంగ్లాదేశ్ ఆడాల్సి ఉంది. వరల్డ్ కప్ టోర్నీ ప్రాక్టీస్‌కు వెళ్లాల్సి ఉండడంతో వార్నర్, బెయిర్ స్టో లాంటి ప్లేయర్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు దూరం కానున్నారు. ఇలా చాలా ఖాళీ స్థానాల్లో ఆడే అవకాశం వస్తుందని భావించిన బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్.. తనకు ఐపీఎలే ముఖ్యమని రావడం కుదరదని తెగేసి చెప్పాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. లీగ్ మ్యాచ్‌ల్లో ఆడేందుకు అవకాశాలు రావడం లేదు కదా. ఏప్రిల్ 23కల్లా తిరిగొచ్చేయమని చెప్పాం. కానీ, సన్‌రైజర్స్ ఖాళీ స్థానంలో ఆడేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయని రావాలనుకోవడం లేదని తెలిపాడు. ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లు ఆడకుండా ఐపీఎల్ ఆడుకోవడానికి అతనికి పర్మిషన్ ఇచ్చాం అని వెల్లడించాడు.