షూలు పంచి మిమ్మల్ని అవమానించారు: ప్రియంక

SMTV Desk 2019-04-23 13:23:14  priyanka gandhi, congress party, loksabha elections, amethi constituency, smriti irani, bjp

అమేథి: కాంగ్రెస్ పార్టీ ప్రధానధ్యక్షురాలు ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచింది. ఈ నేపథ్యంలో సోమవారంనాడు అమేథీ పర్యటనలో భాగంగా ఆమె కేంద్ర మంత్రి, బిజెపి అమేథీ అభ్యర్థి స్మృతి ఇరానీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ’స్మృతి ఇరానీ ఇక్కడుకు వచ్చి షూలు పంచారు. ఇది మిమ్మల్ని అమానించడమే’ అని ఆమె అన్నారు. అమేథీ, రాయబరేలి ప్రజలు ఎప్పుడూ ఎవర్నీ అడుక్కోలేదని, మిమ్మల్ని అవమానపరిచిన వారికి, మీరు తీసుకున్నవి (పాదరక్షలు) తిరిగిచ్చేయండని కోరారు. స్మృతి ఇరానీ ఓట్ల కోసం ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, తప్పుడు హామీలు ఇస్తున్నారని అన్నారు. అమేథి, రాయబరేలి ప్రజలకు గాంధీ కుటుంబం పట్ల అవ్యాజమైన ప్రేమ ఉందని, వారి ఆదరణ, అభిమానం ఎప్పటికీ మరచిపోలేమని చెప్పారు. రాహుల్ తరఫున అమేథీలో సోమవారం ప్రచారం సందర్భంగా ప్రియాంక గాంధీ వాద్రా తనపై చేసిన వ్యాఖ్యలనుస్మృతి ఇరానీ తిప్పికొట్టారు. ప్రియాంక తెగ నటించేస్తున్నారంటూ ప్రతి విమర్శలు చేశారు. ’నేను నటిని, ప్రియాంక నటించకుండా ఉంటే మంచిది. పేద ప్రజలకు కనీసం పాదరక్షలు కూడా లేవు. ముందు ఆమె (ప్రియాంక) హరిహర్‌పూర్ వెళ్లి మాట్లాడితే బాగుంటుంది. అసలు హరిహర్‌పూర్ ఎక్కడుందో జాడతెలియకుండా పోయిన ఎంపీని ఆమె అడిగితే ఇంకా మంచిది’ అని స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు.