నిరుద్యోగులకు శుభవార్త ..

SMTV Desk 2019-04-22 17:34:50  Bhel, Jobs,

భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్(BHEL) లో ఉద్యోగాల భర్తీకోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 145 ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఎంపికైన అభ్యర్థులు ఒక సంవత్సరం ట్రైనింగ్ ఉంటుంది. సంబంధిత విభాగాల్లో ఇంజనీర్ పూరర్తి చేసిన వారు ఉద్యోగాలకు అర్హులుగా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 145
విభాగాల వారీగా ఖాళీలు

మెకానికల్ -30 పోస్టులు
ఎలక్ట్రికల్ -30 పోస్టులు
సివిల్ -20 పోస్టులు

కెమికల్ -10 పోస్టులుఫైనాన్స్ : -25 పోస్టులు
విద్యార్హత : పోస్టులను బట్టి సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ చేసిన వారు అర్హులు
ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా..
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 16-04-2019
చివరి తేదీ : మే 6, 2019
ఆన్‌లైన్ పేమెంట్ చేసేందుకు చివరి తేదీ : మే 8,2019(సాయంత్రం 6గంటల లోపు)
పరీక్షా తేదీ : మే 25, 26, 2019