ధోని మరో @రికార్డ్

SMTV Desk 2019-04-22 15:11:44  mahendra singh dhoni, virat kohli, chennai super kings, royal challengers Bangalore, Chris gale, suresh raina, ab di villars, ipl 2019, csk vs rcb

ఆదివారం రాత్రి చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. అయినప్పటికీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వీరోచిత ప్రదర్శనతో ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు. 48 బంతుల్లోనే 84 పరుగులు సాధించి జట్టుకు హైస్కోరర్‌గా నిలవడమే కాకుండా, అతని ఐపీఎల్ కెరీర్లోనే ఎప్పుడూ చేయనంత అధిక స్కోరును నమోదు చేశాడు. అంతేకాకుండా ఐపీఎల్ 12సీజన్లలో 200కు పైగా సిక్సులు బాదిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో విధ్వంసక ప్లేయర్ క్రిస్ గేల్ 323 సిక్సులతో టాప్ లిస్ట్‌లో ఉండగా డివిలియర్స్ 204సిక్సులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ధోనీ 203సిక్సులతో మూడో స్థానంలో ఉంటే, తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ, సురేశ్ రైనాలు 190సిక్సులతో నిలిచారు. కోహ్లీ ఖాతాలోనూ 186సిక్సులు ఉన్నాయి.