నేచురల్ స్టార్ నాని మరోసారి రెచ్చిపోయాడు..కథనే నమ్ముకొని వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ హిట్ అందుకున్నాడు. గౌతమ్ డైరెక్షన్లో నాని నటించిన జెర్సీ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి అఖండ విజయం సొంతం చేసుకుంది. అభిమానులు , సినీ ప్రేక్షకులే కాక సినీ ప్రముఖులు సైతం సినిమాను చూసేందుకు పోటీ పడుతున్నారు. ముఖ్యం గా ఈ సినిమాలో నాని చేసిన నటన అందర్నీ ఫిదా చేస్తుంది.
లవర్ బాయ్ గా..కమెడియన్ గా కనిపించిన నాని..ఈ సినిమాలో తండ్రి రోల్ చేసి అందర్నీ కంటతడి పెట్టించాడు. కొడుకు కోరిక ను తీర్చేందుకు కష్టపడే పాత్రలో ఎంతో చక్కగా ఒదిగిపోయాడు. సినిమా మొత్తం తన భుజాలపై వేసుకొని నిలబెట్టాడు. ఎమోషనల్ సీన్లలో తను ఎంత బాగా నటించగలడో ఈ సినిమాతో మరోసారి రుజువైంది. ఒక క్రికెటర్‌గా, ఒక ప్రేమికుడిగా ఎంత చక్కగా నటించాడో.. ఒక తండ్రి అంతే బాగా నటించాడు.
ఇక సోషల్ మీడియా లో అయితే ఈ సినిమా డైలాగ్స్ వైరల్ గా మారుతున్నాయి.
* ఇంతపెద్ద ప్రపంచంలో నన్ను జడ్జ్ చెయ్యని వాడు నా కొడుకు ఒక్కడే, వాడి దృష్టిలో నేను కొంచం తగ్గినా తట్టుకోలేను..
* ఏం చెయ్యమన్నా చేస్తాను సర్.. కాని మళ్ళి తలదించుకోలేను సర్
* పదేళ్ల క్రితం ఆగిపోయిన నా జీవితాన్ని మళ్లీ మొదలు పెడతాను.
* ఆపేసి ఓడిపోయినవాడు ఉన్నాడు కాని ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు లేదు.
* దెబ్బ తగిలిన ప్రతిసారి పారిపోతున్నావ్.. ఏదో ఒకసారి నన్ను వదిలేసి వెలిపోతావ్ అని భయంగా ఉంది..ఇలా ఇవే ఏంటి చాల డైలాగ్స్ మనసుకు హత్తుకునేలా ఉన్నాయి.
ఈ డైలాగ్స్ కోసమైనా మరోసారి సినిమా చూడాలని అంటున్నారంటే అవి ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవాలి. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నానికి జోడీగా శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళ సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.