హెలికాప్టర్ షాట్ .. ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది మహేంద్ర సింగ్ ధోని .. హెలికాప్టర్ షాట్ భారీగా బాదడంలో సిద్ధహస్తుడు ధోని .. అయితే 2019 ఐపిఎల్ సీజన్లో హార్దిక్ పాండ్య రెండు సార్లు హెలికాప్టర్ షాట్ కొట్టి ఆశ్చర్య పడిచాడు .. ఢిల్లీ స్టార్ బౌలర్ రబాడ వేసిన చివరి ఓవర్‌లో హార్ధిక్ కళ్లు చెదిరే భారీ సిక్సర్ బాదాడు. ధోనికి మాత్రమే సాధ్యమైన హెలికాప్టర్ షాట్ తో బంతిని స్టాండ్ కు పంపించాడు. ఇలా లెగ్‌స్టంప్‌పై పడ్డ బంతిని బలంగా బాది బ్యాట్ ను గింగిరాలు తిప్పుతూ డీప్ మిడ్‌వికెట్ మీదుగా కొట్టిన ఈ భారీ అభిమానుల మనసును దోచుకుంది. మరీ ముఖ్యంగా ధోని అభిమానులు పాండ్యా సిక్సర్ ను మెచ్చుకోకుండా వుండలేకపోతున్నారు. నిజంగానే ఇది అచ్చు మా బాస్(ధోని) స్టైల్లోనే వుందని సంబరపడుతున్నారు.
అంతకుముందు వాంఖడే స్టేడియంలో చైన్నైతో మ్యాచ్‌లో ధోని ముందే హెలికాప్టర్ షాట్ ఆడాడు. హెలికాప్టర్ షాట్ ఆడతానని ఎప్పుడూ అనుకోలేదు. నెట్స్‌లో తరచుగా ప్రాక్టీస్ చేస్తున్నా. నేనాడే హెలికాప్టర్ షాట్ చాలా బాగుందని ధోని చెప్పాడు అని హార్దిక్ తెలిపాడు.