పెళ్లికి సిద్ధమవుతున్న బాలీవుడ్ జంట

SMTV Desk 2019-04-20 10:48:23  Marrige, Bollywood, Mallika arora, arjun kapoor

బాలీవుడ్ ఘాటు ప్రేమికులు మలైకా అరోరా-అర్జున్ కపూర్‌లు ఈమధ్య తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇద్దరికీ 13 ఏళ్ల వయసుల తేడా ఉన్నా అదేమీ పట్టించుకోకుండా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుండడంతో త్వరలోనే వారు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇదిలా ఉండగా ఈనెల 19న గోవాలో మలైకా, అర్జున్‌ల వివాహం అని… అందుకే ఇటీవల సన్నిహితులకు పార్టీ కూడా ఇచ్చారని బాలీవుడ్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. ఈ విషయమై మలైకాతో… “మీరు హిందు సంప్రదాయంలో వివాహం చేసుకుంటారా? లేదా క్రైస్తవ సంప్రదాయంలోనా?” అని అడిగితే ఏమీ చెప్పకుండా తప్పించు కుంది. అర్జున్‌కపూర్‌తో ప్రేమ విషయాన్ని కూడా ఆమె ఖండించ లేదు. దీంతో మలైకా, అర్జున్‌లు గాఢ మైన ప్రేమలో మునిగితేలు తున్నారని అంటున్నారు.