వైరల్ అవుతున్న రకుల్ ఫిట్ నెస్ వీడియో

SMTV Desk 2019-04-20 10:44:12  Rakul preet singh, fitness video,

హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అనడంలో సందేహం లేదు. సమయం దొరికితే చాలు జిమ్‌లో వాలిపోతుంది. అక్కడున్న జిమ్ ఎక్విప్మెంట్స్ తో ఎక్సర్ సైజ్ లు చేస్తూ బిజీగా మారిపోతుంది. రీసెంట్ గా అజయ్ దేవగణ్ తో చేస్తున్న బాలీవుడ్ సినిమా కోసం ఏకంగా పదికేజీల బరువు తగ్గింది. బాలీవుడ్ సినిమాలకు ఎంత నాజూగ్గా ఉంటె అంత మంచిది.


కానీ, టాలీవుడ్ విషయంలో అలా కాదు. చూసేందుకు చక్కగా ఉంటాయి. రూపం నిండుగా ఉంటె చూసేందుకు బాగుంటుంది. బహుశా నాగ్ కూడా అందుకే బరువు పెరగమని చెప్పుంటాడు. ప్రస్తుతం టాలీవడ్ లో నాగార్జున మన్మధుడు 2 లో హీరోయిన్ గా చేస్తోంది రకుల్. జిమ్ లో కష్టపడి కసరత్తులు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ అయ్యింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. రకుల్ జిమ్ వర్కౌట్స్ ను చూసిన నెటిజన్లు రకుల్ స్టామినా మాములుగా లేదుగా అంటూ నోరెళ్లబెడుతున్నారు.