గోరఖ్‌పూర్ ఘటనలో లోపమెక్కడ..?

SMTV Desk 2017-08-18 16:04:40  Gorakhpur, Uttar Pradesh, Pushpa sales pvt ltd, oxygen

హైదరాబాద్, ఆగస్ట్ 18 ː గోరఖ్‌పూర్ దుర్ఘటనలో 71 మంది చిన్నారులు మెదడువాపు వ్యాధికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ చిన్నారుల మృతికి కారణ౦ ఆక్సిజన్ కొరతే అని స్పష్టం చేసిన, వారి మృతికి కారణం ఆక్సిజన్ లోపం కాదంటూ యోగి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిన్నారుల మృతికి కారణాలను తెలపండి అంటూ జిల్లా కలెక్టర్ ఐదుగురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. డాక్టర్ సతీష్ కుమార్, ప్రిన్సిపల్ ఆర్‌కే మిశ్రాలతో పాటు ఆక్సిజన్ కొనుగోలు కమిటీ అధ్యక్షులే బాధ్యులని డిస్ట్రిక్ మేజిస్ట్రేట్ రాజీవ్ రౌతెలా ఆరోపించారు. ఆక్సిజన్ ను నిలిపివేసినందుకు పంపిణీ సంస్థ "పుష్పా సేల్స్" కూడా ఈ మరణాలకు బాధ్యత వహించాలని, ఈ మొత్తం విషాదం వెనుక డాక్టర్ కఫీల్ ఖాన్‌కు కూడా సమాన బాధ్యత ఉందని కలెక్టర్ తన నివేదికలో వెల్లడించారు. గోరఖ్‌పూర్ దుర్ఘటనపై జ్యూడీషియల్ విచారణ చేపట్టాలంటూ అలహాబాద్ హైకోర్టులో పిల్ దాఖలు కాగా, దీనిపై విచారణను చేపట్టనున్నారు. ఈ వ్యవహారంపై అత్యున్నత స్థాయి విచారణలు ఆదేశాలు జారీ అయ్యాయి.