అఖిల్ సినిమాలో కైరా

SMTV Desk 2019-04-19 18:29:03  kiara advani ,

సూపర్ స్టార్ మహేష్ భరత్ అను నేను సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ. ఆ తర్వాత రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించింది. ఈ సినిమా ప్లాప్ కావడంతో.. తెలుగులో కైరా జోరుకి బ్రేక్ పడినట్టయింది. ఐతే, కాస్త గ్యాప్ తర్వాత మళ్లీ కైరా కోసం ట్రై చేస్తున్నారు టాలీవుడ్ దర్శక-నిర్మాతలు.

తాజాగా, అఖిల్ సినిమాలో కైరా హీరోయిన్ గా ఎంపికైనట్టు సమాచారమ్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ నాల్గో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించనుంది. ఈ సినిమా కోసం కైరాని హీరోయిన్ గా ఫైనల్ చేసినట్టు తెలిసింది. త్వరలోనే సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.