మోదీ హెలికాప్టర్‌ తనిఖీ...అధికారిపై వేటు

SMTV Desk 2019-04-18 19:38:09  narendra modi, pm modi, modi helicopter checking by election commission officers

ఒడిశా: దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశాలోని సంబల్‌పూర్‌లో ప్రచారానికి వెళ్లినప్పుడు ఆ సమయంలో మోదీ హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన అధికారిపై వేటు పడటం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. మంగళవారం ప్రధాని మోదీ సంబల్‌పూర్‌ సభలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆయన హెలికాప్టర్‌లోని లగేజీని కర్ణాటక క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి మొహమ్మద్‌ మొహసిన్‌ తనిఖీ చేయించారు. ఈ సోదాలపై ఈసీ ఏకసభ్య విచారణ కమిటీని నియమించింది. ఎస్పీజీ రక్షణ ఉన్న ప్రధాని వంటి వీవీఐపీలకు తనిఖీ నుంచి మినహాయింపు ఉంటుందని, ఈసీ ఆదేశాలను మొహిసిన్ ఉల్లంఘించారని ఏకసభ్య కమిషన్ నివేదిక ఇచ్చింది. దీంతో ఆ అధికారిపై సస్పెన్షన్ వేటు వేస్తూ.. ఆయన విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొంది. సోదాల సమయంలో మోదీ 15 నిమిషాల పాటు వేచిచూసినట్లు తెలుస్తోంది.