జబర్దస్త్ షోను మించిన రాహుల్ గాంధీ అల్టిమేట్ కామెడీ

SMTV Desk 2019-04-17 18:35:55  rahul gandhi ultimate comedy, rahul gandhi, congress party

కేరళ: లోక్ సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్వహించిన ఓ సభ పూర్తిగా నవ్వుల మయంగా సాగింది. కేరళలోని పథనంథిట్ట, అలప్పుళా ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. అయితే పథనంథిట్ట ఎన్నికల బహిరంగ సభ మాత్రం పిచ్చకామెడీకి వేదికైంది. రాహుల్ ప్రసంగం చేస్తున్నప్పుడు ఆయనకు ట్రాన్స్‌లేటర్‌గా వ్యవహరించి ప్రసంగాన్ని మళయాలం లోకి అనువదిస్తున్న రాజ్యసభ మాజీ డిప్యూటీ ఛైర్మన్‌ పీజే కురియన్‌ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదే సమయంలో రాహుల్ నవ్వులు, అతని బిహేవియర్ నెటిజన్ లను అమితంగా ఆకర్షించి పొట్టచెక్కలయ్యేలా నవ్వుకునేట్టు చేస్తున్నాయి. ఆ వీడియో ఇప్పుడు నెట్లో చక్కర్లు కొడుతుంది. అయితే, మైక్‌లో సాంకేతిక సమస్య, రీ సౌండ్ కారణంగా కురియన్ కు రాహుల్ ప్రసంగం క్లియర్ గా వినిపించలేదు. అందుకే ఈ సమస్య.