ధోని ఉన్నా కూడా దినేశ్ కార్తీక్‌ని ఆడించండి : కటిచ్

SMTV Desk 2019-04-17 15:52:22  world cup 2019, mahendra singh dhoni, dinesh karthik, kkr coach katich, Simon Katich

న్యూఢిల్లీ: వరల్డ్ కప్ టోర్నీకి 15 మందితో కూడిన భారత్ జట్టుని సోమవారం సెలక్టర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో రెండో వికెట్‌ కీపర్‌గా దినేశ్ కార్తీక్‌ని ఎంచుకున్నారు. రెస్ట్ లేదా గాయం కారణంగా ధోనీ మ్యాచ్‌లో ఆడలేకపోతే అప్పుడు కార్తీక్‌ని ఆడిస్తామని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఇప్పటికే ప్రకటించారు. అయతే ధోనీ టీమ్‌లో ఉన్నా సరే.. కార్తీక్‌ని మిడిలార్డర్‌లో.. అదీ నెం.4లో ఆడించాలని తాజాగా కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటింగ్ కోచ్ సైమన్ కటిచ్ సూచించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘ఫినిషర్‌గా మ్యాచ్‌ల్ని ముగించడంలో దినేశ్ కార్తీక్ సామర్థ్యంపై ప్రస్తుతం ఎవరికీ సందేహాల్లేవు. గత కొంతకాలంగా అతను నిలకడగా రాణిస్తున్నాడు. ప్రపంచకప్‌‌లో నెం.4 స్థానంలో ఆడే భారత బ్యాట్స్‌మెన్ గురించి సుదీర్ఘ చర్చ జరుగుతోంది. ఆ స్థానంలో దినేశ్ కార్తీక్‌ బాగా నప్పుతాడు. అతను క్రీజులో కుదురుకుంటే.. బౌలింగ్ చేయడం చాలా కష్టం. ముఖ్యంగా.. షార్ట్ పిచ్ బంతుల్నీ కూడా కార్తీక్ అలవోకగా బౌండరీకి తరలించగలడు. తాజా ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీపై అతను రెండు హుక్ షాట్స్ ద్వారా సిక్సర్లు రాబట్టడం అతని బ్యాటింగ్‌ నైపుణ్యానికి నిదర్శనం’ అని కటిచ్ వెల్లడించాడు.