హైదరాబాద్: ప్రభుదేవా హీరోగా తమన్నా హీరోయిన్ గా వస్తున్న సినిమా ‘అభినేత్రి2’. ‘అభినేత్రి’సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాకు ఎ.ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఇక మే 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాను తమిళంలో ‘దేవి 2’ టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. ఈ టీజర్ తో అభినేత్రి2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.