ఎస్‌బీఐలో 9వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్

SMTV Desk 2019-04-16 16:43:59  SBI, Sbi recruitment

తెలంగాణతో దేశవ్యాప్తంగా గల వివిద శాఖలలో 8,904 జూనియర్ అసోసియేట్ పోస్టులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భర్తీ చేయబోతోంది. తెలంగాణలో 425, ఏపీలో 253 పోస్టులను భర్తీ చేయబోతోంది. ఈ పోస్టులను రాష్ట్రాల వారీగా భర్తీ చేయనున్నందున ఏ రాష్ట్రంలో పోస్టులకైనా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ రాష్ట్రంలో పరీక్షలకు ఆజరుకావచ్చు. కానీ స్థానిక బాషా పరీక్షలో పాస్ అవవలసి ఉంటుంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో ప్రిలిమ్స్, మెయిన్స్, లోకల్ లాంగ్వేజ్ పరీక్షలు వ్రాయవలసి ఉంటుంది. ముందుగా ప్రిలిమ్స్ పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్ధులకు మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే అవకాశం లభిస్తుంది. ఈ ప్రిలిమ్స్ పరీక్షలలో ఒక్కో పోస్టుకు 10 మంది చొప్పున 425 పోస్టులకు 4,250 మంది అభ్యర్ధులను ఎంపికచేస్తారు. వారిలో మెయిన్స్ లో అత్యధిక మార్కులు సాధించినవారితో మెరిట్ లిస్ట్ తయారుచేస్తారు. జూన్ 8వ తేదీన ఎస్‌బీఐ ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించబడతాయి. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలకు: https://www.sbi.co.in/careers/ లో చూడవచ్చు. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు సాధారణ డిగ్రీ సరిపోతుంది కనుక డిగ్రీ పూర్తిచేసిన నిరుద్యోగయువతకు ఇది ఒక మంచి అవకాశమే.