ఆ లిస్ట్ లో ప్రియాంక ఉందట ?

SMTV Desk 2019-04-16 16:30:02  Priyanka Chopra, meetoo

బాషలతో సంబంధం లేకుండా దాదాపు అందరు హీరోయిన్స్ గతంలో తాము ఎదుర్కొన్న లైంగిక వేదింపుల గురించి సమయం వచ్చినప్పుడు బయట పెడుతున్నారు. మీటూ అంటూ పెద్ద ఉద్యమం మొదలైన నేపథ్యంలో ఎంతో మంది హీరోయిన్స్ తాము ఎదుర్కొన్న లైంగిక వేదింపుల గురించి మీడియా ముందు చెప్పారు. పలువురు స్టార్ హీరోయిన్స్ సైతం ఆశ్చర్యకరంగా తాము లైంగిక వేదింపులకు గురయ్యామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా బాలీవుడ్ స్టార్ అంత‌ర్జాతీయ స్థాయిలో పాపురల్ అయిన ప్రియాంకా చోప్రా త‌న అభిమానులను షాక్‌కు గురి చేసింది.

త‌ను కూడా లైంగిక వేధింపుల‌కు గుర‌య్యాని తెలిపింది. ‘ఎప్పుడైనా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నారా..?’ అని యాంక‌ర్ ప్రశ్నించగా.. వెంటనే తన చెయ్యి పైకెత్తి.. ”ఎస్.. నేను కూడా బాధితురాలినే” అని చెప్పింది. అయితే దానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డించ‌లేదు. హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన సమయంలోనా లేదా మోడలింగ్ లో ఉన్న సమయంలోనా అనే విషయంపై ఆమె క్లారిటీ ఇవ్వలేదు. కాని తాను కూడా లైంగిక వేదింపుల బాధితురాలినే అంటూ చెప్పుకొచ్చింది