ఈ ఏడాది 96 శాతం వర్షపాతం

SMTV Desk 2019-04-16 15:47:27  whether report, rainy season, winter season

ఈ ఏడాది వర్షాకాలంలోని మొదటివారంలో నైరుతీ రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకబోతున్న నేపథ్యంలో వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 2019 మొదటి దశ వాతావరణ అంచనాలను ఐఎండీ విడుదల చేసింది. గడిచిన రెండేళ్లలో దేశంలో మంచి వర్షాలు కురిసి, పంటలు పండాయని ఈసారి కూడా అదే స్థాయిలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. సుమారు 96 శాతం వర్షపాతం రికార్డ్ అవుతుందని ఐఎండీ డైరెక్టర్‌ రమేశ్ అన్నారు. జూన్ ఎండల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుందని, ఎల్‌-నినో ప్రభావం నామమాత్రంగానే ఉంటుందని ఆయన తెలిపారు. ఈ ఏడాది జూన్ మొదటివారంలో రెండోదశ వర్షాపాతం అంచనాలను విడుదల చేస్తామని రమేశ్ ప్రకటించారు.