సెంట్రల్ సర్కార్ కు, ఈసీకి సుప్రీం నోటీసులు

SMTV Desk 2019-04-16 15:14:16  central government, election commission, supreme court

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జరీ చేసింది. విధులు నిర్వహించడంలో ఆలసత్వం వహిస్తున్నారాని, అధికారులను ఈసీ పూర్తిగా వినియోగించుకోవడంలేదని నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ నియమావళికి సంబంధించిన నేతల వ్యాఖ్యలపై పరిశీలిస్తున్నామని ఈసీ సమాధానం ఇచ్చింది. నేతలపై వెంటనే చర్యలు తీసుకోలేమని ఈసీ కోర్టుకు తెలిపింది. ఈసీ సమాధానంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.