నభా నటేశ్ దిమాఖ్ ఖరాబ్ స్టిల్స్

SMTV Desk 2019-04-15 10:45:08  Ram pothineni, Puri jagannad, Ishmart Shankar Movie, Remuneration, nidhi agarwal, nabha natesh, charmie, dimakh kharab song

హైదరాబాద్: ఎనర్జిటిక్ హీరో రామ్, సంచలన దర్శకుడు పూరి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్ బ్యానర్‌లపై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ పాటలో నిధి అగర్వాల్, నభా నటేశ్ ఇద్దరూ రామ్‌తో కలిసి స్టెప్పులేస్తున్నారు. దిమాక్ ఖరాబ్… అంటూ తెలంగాణ యాసలో సాగే ఈ పాటకు సంబంధించి ఇటీవల విడుదలైన నిధి అగర్వాల్ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు నభా నటేశ్ ఫొటోలు విడుదలయ్యాయి. ఇందులో నభా సరికొత్త లుక్‌లో దర్శనమిచ్చి ఆకట్టుకుంటోంది. ఇక మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.