ఎవడు కాంబో రిపీట్!!!

SMTV Desk 2019-04-15 10:35:03  vamshi paidipally, ram charan, maharshi, rrr

ఎవడు సినిమాతో రామ్ చరణ్ కు మంచి హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందని టాక్. వంశీ డైరెక్ట్ చేస్తున్న ఐదవ సినిమా ‘మహర్షి’ ఇంకా విడుదల కాలేదు. రెండు, మూడు సంవత్సరాలకు ఒక సినిమా చొప్పున చేస్తున్న వంశీ పైడిపల్లి ‘మహర్షి’ చిత్రం తర్వాత కూడా వెంటనే కొత్త సినిమా చేసేలా లేరు. ఇక ఈ చిత్రం తర్వాత ఆయన రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే చరణ్‌తో ‘ఎవడు’ అనే చిత్రాన్ని తెరకెక్కించి సక్సెస్ అయిన వంశీ మరోసారి అతన్ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాను చేస్తున్నారు రామ్‌చరణ్. దీని తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చరణ్ తన నెక్ట్స్ మూవీ చేస్తారని అనుకున్నారు. కానీ తాజాగా దర్శకుడు వంశీ పైడిపల్లి పేరు తెరపైకి వచ్చింది. ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ వచ్చే ఏడాది జూలైలో విడుదలవుతుంది. ఆతర్వాత కొద్ది సమయం తీసుకొని చరణ్ తన నెక్ట్స్ సినిమాను మొదలుపెడతారు. అంటే వచ్చే ఏడాది చివరలో వంశీ పైడిపల్లికి చరణ్ డేట్లు ఇస్తారు. ఇక వంశీ ఏ సినిమాను అయినా కనీసం సంవత్సరం పాటు తెరకెక్కిస్తారు. దీంతో చరణ్, వంశీ పైడిపల్లి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేటప్పటికి రెండేళ్లు లేదా మూడేళ్లు పట్టవచ్చు.