ఈసీపై సిఇసికి ఫిర్యాదు చేసిన బాబు

SMTV Desk 2019-04-14 11:49:46  andhrapradesh elections, chandrababu, tdp, ysrcp, kcr, trs, bjp, narendra modi, central election commission of india

న్యూఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు పోలింగ్ సమయంలో ఈసీ తీరుపై సిఇసికి ఫిర్యాదు చేశారు. సిఇసి సునీల్‌ అరోడాను చంద్రబాబు కలిశారు. రాష్ట్రంలో పోలింగ్‌ జరిగిన తీరు, ఈవీఎంల లోపాలపై ఆయన సిఇసికి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు సహా 20 మంది సభ్యుల బృందం సిఇసిని కలిసింది. సుజనా చౌదరి, కొనకళ్ల నారాయణ, మాల్యాద్రి శ్రీరాం, యనమల, కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, తోట సీతారామ లక్ష్మీ, మాగంటి బాబు, మురళీమోహన్, గంటా శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణ, కనకమేడల రవీంద్ర కుమార్, కంభంపాటి రామమోహనరావు తదితరులు సిఇసిని కలిసిన వారిలో ఉన్నారు. ఇసి తీరు, ఈవీఎంల లోపాలపై జాతీయ స్థాయిలో ఉద్యమించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇదిలా ఉండగా ఈ అంశంలో చంద్రబాబుకు యుపి మాజీ సిఎం, ఎస్ పి చీఫ్ అఖిలేష్ యాదవ్ పూర్తి మద్ధతు తెలిపారు.