ధోని చేసింది కచ్చితంగా తప్పే!!!

SMTV Desk 2019-04-14 11:24:40  ipl 2019, csk vs rr, mahendra singh dhoni, dhoni argument in umpires, jos buttler

జైపూర్‌: గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంపైర్లతో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదం పై రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ స్పందిస్తూ...ఇలా మైదానంలోకి వెళ్లి అంపైర్లతో వాగ్వాదానికి దిగడం ఎంతమాత్రం సరైనది కాదని పేర్కొన్నాడు. ఒకసారి మైదానం విడిచి వెళ్లిపోయిన క్రికెటర్‌…మళ్లీ పిచ్‌లోకి వచ్చి వివరణ కోరడం తన వరకు అయితే కచ్చితంగా తప్పేనన్నాడు. ఆ సమయంలో నేను బౌండరీ లైన్‌ వద్ద పీల్డింగ్‌ చేస్తున్నా. అసలు ఏమి జరిగింది అనేది నాకు పూర్తిగా తెలియదు. అయినప్పటికీ డగౌట్‌ నంచి ధోని వచ్చి అంపైర్లను ప్రశ్నించడం సరైన చర్య కాదు. ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగింది. అందులో ధోని ఇలా ఫీల్డ్‌లోకి రావడం గేమ్‌లోని మరింత వేడి పుట్టించింది. చివరకు మ్యాచ్‌ను చేజార్చుకోవడం నిరాశ కల్గించింది. గెలుస్తామనుకున్న మ్యాచ్‌లో పరాజయం వెక్కిరించింది. ఈ సీజన్‌లో వరుస పరాజయాలు చవిచూడటం మాజట్టును తీవ్ర నిరాశకు గురిచేస్తోందని బట్లర్‌ పేర్కొన్నాడు.