ప్రకాష్‌రాజ్‌కు విశాల్ సపోర్ట్

SMTV Desk 2019-04-14 11:12:58  Prakash raj, Actor, Parliament elections, Bengulur, Independent, police case, election code, vishal

చెన్నై: ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా రాజకీయ పార్టీ పెట్టి బెంగుళూరు లోక్‌సభ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈయనకి నడిగర్‌ సంఘ అధ్యక్షుడు, నటుడు విశాల్‌ మద్దతు ప్రకటించారు.శుక్రవారం విశాల్‌ ఒక వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించడం చాలా కష్టమని అందుకు ధైర్యంతో పాటు ప్రజలకు సేవ చేయాలనే ద్రుఢ సంకల్పం అవసరమని ఆయన అన్నారు.అందుకు సరైన వ్యక్తిగా నటుడు ప్రకాష్‌రాజ్‌ నిలిచారని పేర్కొన్నారు.ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రకాష్‌రాజ్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని, సెంట్రల్‌ బెంగుళూరు లోక్‌సభ స్థానంలో ‘విజిల్‌’ గుర్తుపై పోటీచేస్తున్న ఆయనకు తాను ‘విజిల్‌’ వేసి అభినందిస్తున్నానని విశాల్ పేర్కొన్నారు.