జ‌లియ‌న్‌వాలాబాగ్ @100 ఏళ్ళు

SMTV Desk 2019-04-14 10:54:15  jallianwalabhagh, Jallianwala Bagh massacre, allianwala Bagh massacre centenary, rowlatt act, theresa may, theresa

న్యూఢిల్లీ: భారత దేశ్ చరిత్రలో ఎన్నిటికి మరచిపోని సంఘటన జ‌లియ‌న్‌వాలాబాగ్. ఈ ఘటనకు నేటితో ( ఏప్రిల్ 13 ) వందేళ్ళు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో యావత్ భారత ప్రజలు నాటి దారుణ ఘటనలో అమరులైన వారికి నివాళులు అర్పిస్తున్నారు. ప్ర‌ధాని నరేంద్ర మోడీ కూడా అమరవీరులకు నివాళులు అర్పించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించినవారి సాహాసాన్ని, త్యాగాన్ని మ‌రిచిపోలేమ‌ని మోడీ ట్వీట్ చేశారు. వారి జ్ఞాప‌కాలు న‌వ భార‌త నిర్మాణం కోసం మ‌రింత క‌ష్ట‌ప‌డేలా చేస్తున్నాయ‌ని ఆయన పేర్కొన్నారు. జలియన్ వాలాబాగ్ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ రక్షణ కోసం ప్రతి భారతీయుడు ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.