మోదీకి రష్యా అరుదైన గౌరవ అవార్డు

SMTV Desk 2019-04-12 18:35:14  indian prime minister, narendra modi, russia government, Russian award,Narendra Modi,PM Modi, Order of St Andrew the Apostle

న్యూఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోదీకి రష్యా ప్రభుత్వం అరుదైన గౌరవ పురస్కారాన్ని అందించనుంది. “ఆర్డర్‌ ఆఫ్‌ సెయింట్‌ ఆండ్య్రూ ది అపోస్టల్‌’” అనే రష్యా అత్యున్నత పౌర అవార్డుతో మోడీని గౌరవించనున్నట్లు శుక్రవారం రష్యా ప్రభుత్వం ప్రకటించింది. మోడీకి ఈ అవార్డును ప్రకటించేందుకు శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆదేశాలు జారీ చేస్తూ సంతకం చేశారు.