అంపైర్లతో వివాదం : ధోనికి జరిమానా

SMTV Desk 2019-04-12 18:18:09  ipl 2019, csk vs rr, mahendra singh dhoni, dhoni argument in umpires

గురువారం రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన మహేంద్రసింగ్ ధోనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అయితే కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వారం వ్యవధిలోనే రెండు సార్లు సహనం కోల్పోయాడు. సుదీర్ఘకాలంగా ‘కెప్టెన్‌ కూల్‌’గా పేరొందిన ధోనీ.. ఇటీవల వరుసగా రెండు నోబాల్స్ విసిరిన చెన్నై ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్‌పై మైదానంలోనే ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత మ్యాచ్ వ్యవధిలోనే తాజాగా రాజస్థాన్ రాయల్స్‌తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో నోబాల్ విషయమై ఫీల్డ్ అంపైర్లతో పెద్ద ఎత్తున వాగ్వాదానికి దిగాడు. దీంతో.. ఐపీఎల్ క్రమశిక్షణ నియమావళి కింద ధోనీ మ్యాచ్‌ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు. వాస్తవానికి ఫీల్డ్ అంపైర్లతో అతిగా వాగ్వాదానికి దిగితే.. సదరు ఆటగాడిపై ఒక టెస్టు లేదా రెండు వన్డేల నిషేధం పడుతుంది. కానీ.. ధోనీ కొద్దిలో ఆ నిషేధం వేటు నుంచి తప్పించుకున్నాడు.