బ్రేకింగ్ ..బీజేపీ మేనిఫెస్టో విడుదల .. ప్రధాన అంశాలు

SMTV Desk 2019-04-09 11:47:10  BJP, BJP manifesto,

నరేంద్ర మోదీ సారధ్యంలో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ... తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో సంకల్ప్ పత్ర పేరుతో ఈ 48 పేజీల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ తమ మేనిఫెస్టోని ప్రకటించి, ఎన్నికల ప్రచారంలో దాన్ని అందరికీ తెలియజేస్తోంది. ముఖ్యంగా పేదవారికి సంవత్సరానికి రూ.72000 ఇచ్చే కనీస ఆదాయ పథకం (న్యాయ్)ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఈ క్రమంలో బీజేపీ కూడా మేనిఫెస్టోని రిలీజ్ చేసి... ఐదేళ్లలో తాము చేసిన అభివృద్ధిని వివరించింది. అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా మేనిఫెస్టోని రూపొందించామన్న బీజేపీ పెద్దలు... మరోసారి మోదీకి అవకాశం ఇవ్వాలని కోరారు.

.బీజేపీ మేనిఫెస్టోలో కీలక అంశాలు :

- దేశ శ్రేయస్సు కోసం ఉమ్మడి పౌర స్మృతి బిల్లు ప్రవేశం
- రైతులు కిసాన్ క్రెడిట్ కార్డులపై లక్ష రూపాయల వరకు తీసుకునే రుణాలకు వడ్డీ రాయితీ
- అన్ని వర్గాల రైతులకూ కిసాన్ సమ్మాన్ నిధి పథకం వర్తింపు.
- చిన్న, సన్నకారు రైతులకు పెన్షన్ పథకం, చిన్న వ్యాపారులకు పెన్షన్ పథకం అమలు
- ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం, జాతీయ భద్రత, తీరప్రాంత రక్షణ, సైనికుల సంక్షేమానికి పెద్దపీట
- జమ్మూకాశ్మీర్‌లో శాంతి భద్రతల పర్యవేక్షణకు ప్రయత్నాలు
- రైతులందరికీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన వర్తింపు
- చిన్న, సన్నకారు రైతులకు పింఛను
- వ్యవసాయ గ్రామీణ రంగానికి రూ.25 లక్షల కోట్ల పెట్టుబడి
- ప్రధానమంత్రి ఫసల్ భీమో యోజన కింద అందరికీ భీమా వర్తింపు
- రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాల సరఫరా.

- దేశవ్యాప్తంగా గిడ్డంగుల నెట్‌వర్క్ ఏర్పాటు
- ఆర్గానికి ఫార్మింగ్‌లో లాభాలు పెరిగేందుకు చర్యలు
- మత్య్స సంపద యోజన కింద రూ.10 వేల కోట్లు కేటాయింపు
- ఆక్వాకల్చర్‌కు తేలిగ్గా రుణ సదుపాయం
- సముద్ర గడ్డి పెంచే దిశగా రైతులకు సదుపాయాలు
- 2022 నాటికి అందరికీ పక్కా ఇళ్లు
- భారత్ నెట్ ద్వారా 2022 నాటికి అందరికీ ఇంటర్నెట్
- జల్ జీవన్ మిషన్ ద్వారా 2024 నాటికి అందిరికీ తాగు నీరు
- సడక్ సే సమృద్ధి ద్వారా అందరికీ రోడ్లు
- స్వచ్ఛ భారత్ మిషన్ కింద వృథా నీటిని తిరిగి మంచి నీరుగా మార్పు