జపాన్ లో సందడి చేయనున్న సాహో

SMTV Desk 2019-04-08 20:44:23  Japan, Saaho,

బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ ఒక్కసారిగా ప్రపంచ సినిమా దృష్టిని అంతటినీ తనవైపు తిప్పుకున్నాడు.ఇక ఆ రెండు సినిమాల తర్వాత ప్రభాస్ ను మళ్ళీ ఒక మిర్చి లాంటి సినిమాలో ఊహించుకోగలమా? అనుకున్న సందర్భంలోనే సుజీత్ తో “సాహో” అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని ఒప్పుకొని ఆశ్చర్య పరిచారు.ఆ సినిమా ఇప్పుడు షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.ఇప్పటికే విడుదలైన రెండు మేకింగ్ వీడియోలతోనే అనేక ప్రకంపనలు రేపింది ఈ చిత్రం.దీనితో ఈ సినిమా పై కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి.

బాహుబలి రెండు సినిమాలను జపాన్ దేశంలో ఏ స్థాయిలో ఆదరించారో అందరికీ తెలిసినదే..అక్కడ బాహుబలిలోని ప్రతీ ఒక్క పాత్ర జపనీయులకు ఎంతగానో నచ్చేసాయి.దానితో బాహుబలి టీమ్ అంతా కూడా అక్కడకి వెళ్లారు.ఇప్పుడు బాహుబలి సినిమా వల్ల మన డార్లింగ్ అక్కడ ప్రేక్షకులకు కూడా అమితంగా నచ్చేసాడు.దాంతో “సాహో” సినిమాను కూడా అక్కడ విడుదల చెయ్యాలని వారు కోరుతున్నారట.ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అక్కడ కూడా విడుదల కాబోతుంది అని తెలుస్తుంది.