అందుకోలేదు. ప్రస్తుతం ఆయన తన 55వ సినిమాను పట్టాలు ఎక్కించే పనిలో ఉన్నారు. ఏ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై పి.వి.గిరి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర ‘బంగారు బుల్లోడు’ టైటిల్‌తో ఓ సినిమాను నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ నటిస్తోన్న 55వ సినిమా ఇది. నరేష్ కు జోడీగా పూజా జవేరి నటిస్తోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనింగ్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసి త్వరలోనే ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా నరేష్ కు మంచి విజయం అందించేవిధంగా ఉంటుందని ఆయన అభిమానులు చెబుతున్నారు.