జనసేన ప్రచారం కోసం రానున్న వరుణ్ తేజ్ ,అల్లు అర్జున్

SMTV Desk 2019-04-04 21:36:41  Janasena, Allu arjun, Varun Tej

అతి త్వరలోనే మెగా కాంపౌండ్ హీరోలు జనసేన ప్రచారానికి తరలి రానున్నారని ఇప్పుడు తెలుస్తుంది.ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు,అదే విధంగా ఈ ఎన్నికల్లో పవన్ చిన్న అన్నయ్య అయినటువంటి నాగబాబు కూడా ఈ సారి ఎన్నికల్లో నర్సాపురం నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసినదే.ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల నుంచి నాగబాబు తనయురాలు నిహారిక మరియు భార్య కొణిదెల పద్మజలు జనసేన పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు.

అయితే తాజాగా పద్మజ గారు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జనసేన పార్టీ తరఫున పోయి చేసేందుకు మెగా కుటుంబం నుంచి ఇంకా వస్తున్నారని తెలిపారు.ఏప్రిల్ 5 నుంచి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జనసేన పార్టీ కోసం ప్రచారం చేసేందుకు రాబోతున్నారని ఎట్టకేలకు వెల్లడి చేసారు.ఇది మాత్రం మెగా అభిమానులకు కాస్త ఊరటనిచ్చే వార్తే అని చెప్పాలి.మరి వీరు ఎన్నికల ప్రచారం ఎలా చేస్తారో చూడాలి.