గంగూలీకి నోటీసులు!

SMTV Desk 2019-04-04 18:17:12  Sourav ganguly, Team india, Australiya, Test match, dc, bcci

ముందు కోల్‌కతా అసోసియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌ (క్యాబ్‌) అధ్యక్షుడిగా ఉన్న గంగూలీని ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం ఐపిఎల్‌ 2019 సీజన్‌ ఆరంభానికి ముందు సలహాదారుగా నియమించుకుంది. దీంతో క్యాబ్‌ పదవిలో ఉంటూ ఐపిఎల్‌ జట్టుకు సలహాదారుగా వ్యవహరించడం విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందంటూ గంగూలీపై ముగ్గురు క్రికెట్‌ అభిమానులు ఫిర్యాదు చేశారు. దీంతో ఈవిషయాన్ని బిసిసిఐలో కొత్త అంబుడ్స్‌మన్‌గా నియమితుడైన జస్టిస్‌ జైన్‌…సౌరవ్‌ గంగూలీకి నోటీసులు పంపించారు. ఇలా రెండు పదవుల్లో ఉంటూ విరుద్ధ ప్రయోజనాలు పొందడంపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి గంగూలీ వివరణ కోరాను. అతడు సమాధానం చెప్పేందుకు గాను వారం రోజుల గడువు ఇచ్చాను. గంగూలీ నుంచి సమాధానం వచ్చిన తర్వాత ఈవిషయంపై ముందుకు వెళ్లాలో మీటింగ్‌లో నిర్ణయం తీసుకుంటామని జైన్‌ అన్నాడు. తన ఎంపిక పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు రాదని సౌరవ్‌ గంగూలీ ఇప్పటికే వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. గంగూలీ మాట్లాడుతూ ‘ఇందులో పరస్పర విరుద్ధ ప్రయోజనాలేమీ లేవు ఇంతకుముందే ఐపిఎల్‌ పరిపాలనా మండలికి రాజీనామా చేశా. సలహాదారు పాత్ర చేపట్టే ముందు సిఓఏను సంప్రదించానని చెప్పాడు.