’96’ తెలుగు రీమేక్ ముహూర్తం ఫిక్స్..!

SMTV Desk 2019-04-04 16:36:20  96 telugu remake,

తమిళ హీరో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన చిత్రం ’96’. గతేడాది ఈ సినిమా రిలీజై బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ సినిమా తెలుగులో నిర్మాత దిల్ రాజు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

శర్వానంద్, సమంతా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ రీమేక్ వెర్షన్ కు ‘జాను’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. తమిళ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఇకపోతే ఉగాది రోజున ఈ చిత్రం లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. గోవింద్ వసంత ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.