కాంగ్రెస్ మేనిఫెస్టోపై మండిపడ్డ సోనియా గాంధీ

SMTV Desk 2019-04-03 16:58:39  sonia Gandhi, rahul gandhi

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మేనిఫెస్టోలని అంశాలపై సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు...అనుకుంటే పొరపాటే...అసలు కారణం ఏమిటంటే.. మేనిఫెస్టోలో ఫ్రంట్ పేజీపై పార్టీ అధ్యక్షుడు, తన కుమారుడు రాహుల్ గాంధీ ఫోటోను చిన్నగానూ, పుస్తకం కవర్ చివరి భాగంలో వేసారని ఆగ్రహం వ్యక్తంచేశారని సమాచారం.

మేనిఫెస్టో విడుదల సందర్భంగా పార్టీ సీనియర్ లీడర్లు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ కేంద్ర మంత్రులు చిదంబరం మాట్లాడినప్పటికీ, సోనియా మాత్రం స్పందించేందుకు నిరాకరించారు. మేనిఫెస్టో ముఖచిత్రంలో రాహుల్ ఫోటోతో పాటు పార్టీ సింబల్ కూడా చివరలో చిన్నగా ఉందని సోనియా అసంత్రుప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

అయితే 2019 సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో ఈ సారి కాంగ్రెస్ పార్టీ తన ట్రంప్ కార్డుగా చెప్పుకునే సాలీనా 72000 రూ.ల కనీస ఆదాయ పథకం గురించి ప్రముఖంగా పేర్కొంది. మొత్తం 55 పేజీల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రధానంగా వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు, గ్రామీణ ఉపాధి హామీ పథకం పనిదినాలు 150 రోజులకు పెంపు వంటి హామీలు ఇచ్చింది.