‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మ్యూజిక్ డైరెక్టర్‌పై కేసు నమోదు

SMTV Desk 2019-04-03 15:07:17  laksmis NTR,

మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణీ మాలిక్‌పై కేసు నమోదైంది. తమ మనోభావాలు దెబ్బతీసేలా మాలిక్ మాట్లాడరంటూ సగర(ఉప్పర)కుల సంఘం నాయకులు ప్రొద్దుటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సంగీతం అందించిన మాలిక్.. ఓ టీవీ చానల్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప్పర కులస్థులను కించపరుస్తూ ‘ఉప్పరసోదీ’, ‘ఉప్పర పనికిమాలిన సోదీ’ అంటూ మాట్లాడారని, అవి తమను కించపరిచేలా ఉన్నాయని కడప జిల్లా అధ్యక్షుడు మాదాసు మురళి, సంఘం నాయకులతో కలిసి ప్రొద్దుటూరు టూటౌన్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కళ్యాణీ మాలిక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.