ప్రజల అభీష్టం మేరకే ఆ విగ్రహాలు కట్టించాం

SMTV Desk 2019-04-02 15:53:09  mayavati, bsp party, uttarpradesh chief minister, supreme court, mayavati statue

న్యూఢిల్లీ : బహుజన సమాజ్‌వాదీ పార్టీ అధినేత మాయావతి ఈ రోజు సుప్రీం కోర్టులో తన విగ్రహాల వివాదంపై అఫిడ‌విట్‌ను దాఖ‌లు చేశారు. ఈ సదర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల అభీష్టం మేరకే ఆ విగ్రహాలు కట్టించానని ఆమె చెప్పారు. అయితే మాయావతి యూపీ సిఎంగా ఉన్న విగ్ర‌హాల‌ను ఏర్పాటు చేశారు. బీఎస్పీ పార్టీకి చెందిన ఏనుగు గుర్తు విగ్ర‌హాల‌ను కూడా ల‌క్నోతో పాటు మ‌రికొన్ని న‌గ‌రాల్లో నిర్మించారు. అయితే ప్ర‌జాధానాన్ని దుర్వినియోగం చేశార‌ని మాయాపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఆ కేసులో ఇవాళ సుప్రీం ముందు బీఎస్పీ నేత స్పందించారు. విగ్రహాల ఏర్పాటుకు అయిన ఖ‌ర్చును తిరిగి ప్ర‌జా ఖ‌జానాకు చెల్లించాల‌ని గ‌తంలో కోర్టు ఆదేశించింది. ఈ నేప‌థ్యంలో ఇవాళ సుప్రీం ముందు మాయా త‌న అఫిడ‌విట్‌ను దాఖ‌లు చేశారు.