21 కోట్ల థియేట్రికల్ రైట్స్ తో మజిలి

SMTV Desk 2019-04-02 13:54:17  majili,

అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న సినిమా మజిలి. షైన్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఉగాది సందర్భంగా ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుంది. రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న మజిలి ఈవెంట్ లో గెస్టులుగా వచ్చిన వెంకటేష్, నాగార్జున సినిమా పక్కా హిట్ అని చెప్పుకొచ్చారు. పెళ్లి తర్వాత చైతు, సమంతలు కలిసి చేసిన సినిమా ఇది.

నిన్ను కోరి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శివ నిర్వాణ రెండో ప్రయత్నంగా చేసిన సినిమా మజిలి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే చేసింది. వరల్డ్ వైడ్ గా 21 కోట్ల థియేట్రికల్ రైట్స్ తో మజిలి వస్తుందట. వీకెండ్ తో పాటుగా ఉగాది కూడా కలిసి వస్తుంది కాబట్టి సినిమా పక్కా హిట్ కొట్టేలా ఉందని అంటున్నారు.



ఏరియాల వారిగా మజిలి బిజినెస్ డీటైల్స్ :

నైజాం : 6 కోట్లు

సీడెడ్ : 2.50 కోట్లు

ఉత్తరాంధ్ర : 1.98 కోట్లు

కృష్ణా : 1.28 కోట్లు

గుంటూరు : 1.62 కోట్లు

నెల్లూరు : 0.70 కోట్లు

ఈస్ట్ : 1.44 కోట్లు

వెస్ట్ : 1.12 కోట్లు

ఏపి/తెలంగాణ : 16.64 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా : 1.50 కోట్లు

ఓవర్సీస్ : 3 కోట్లు

వరల్డ్ వైడ్ : 21.14 కోట్లు