సుప్రీం కోర్టు : వీవీ ప్యాట్‌లపై విచారణ వాయిదా

SMTV Desk 2019-04-01 19:46:40  supreme court, vv pallet case, andhrapradesh chief minister, chandrababu

న్యూఢిల్లీ : సుప్రీం కోర్టులో వీవీ ప్యాట్ల కేసుకు సంబంధించి ఏపి సిఎం చంద్రబాబు నేతృత్వంలో 22 పార్టీల నేతలతో కలిసి పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే సోమవారం వీవీ ప్యాట్‌లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం వచ్చే సోమవారం నాటికి వాయిదా వేసింది. ఈసీ కౌంటర్‌ అఫిడవిట్‌పై పిటిషనర్‌ తరపు న్యాయవాదులు సమయం కోరారు. వారి విజ్ఞప్తి మేరకు సీజేఐ గొగోయ్‌ ధర్మాసనం శుక్రవారంలోగా వివరణ ఇవ్వాలని సూచిస్తూ.. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేశారు.