ఆ రెండు పార్టీలు కలిస్తేనే బీజేపీని చిత్తు చేయొచ్చు!

SMTV Desk 2019-04-01 15:06:26  new delhi, kajriwal, new delhi chief minister, congress party, aap party, bjp, narendra modi, loksabha elections, rahul gandhi

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: దేశరాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ కాంగ్రెస్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తుకు తాము అంగీకరించినా కాంగ్రెస్‌ మాత్రం నో చెప్పిందని అన్నారు. తాను ఇటీవల రాహుల్‌ను కలిశానన్న ఢిల్లీ సీఎం.. ఆప్‌తో చేతులు కలిపేందుకు తిరస్కరించారని చెప్పారు. ఢిల్లీ కాంగ్రెస్‌ నేతలు కూడా అలియన్స్‌ కు విముఖత చూపారాన్నారు.అయితే కాంగ్రెస్‌, ఆప్‌ లు కలిసి పోటీ చేస్తే బీజేపీని చిత్తుగా ఓడించొచ్చని మరోమారు స్పష్టం చేశారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.