టప్తి-గంగా ఎక్స్‌ ప్రెస్‌ తృటిలో తప్పిన పెను ప్రమాదం

SMTV Desk 2019-03-31 20:35:37  14 coaches of the Tapti-Ganga express, Tapti-Ganga Express, Derail In Bihar

పాట్నా, మార్చ్ 31: బీహార్‌ లోని ఛాప్రాలోని గౌతమ్‌ అస్తాన్‌ సమీపంలో రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనలో టప్తి-గంగా ఎక్స్‌ ప్రెస్‌ 14 బోగీలు ఒకేసారి పట్టాలు తప్పాయి. దీంతో పలువురు ప్రయాణీకులకు గాయపడ్డారు. ప్రమాద వశాత్తు ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. గాయపడ్డవారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.