శ్రీలంక టెస్ట్ కెప్టెన్ అరెస్ట్

SMTV Desk 2019-03-31 19:22:49  srilanka cricketer, test captain, dimuth karunaratne, dimuth karunaratne arrest

కొలంబో, మార్చ్ 31: శ్రీలంక టెస్ట్ కెప్టెన్ దిముత్ కరుణరత్నె వివాదంలో చిక్కుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున 5.40 గంటల ప్రాంతంలో కొలంబోలో తన వాహనంతో ముందు వెళ్తున్న ఓ వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో ఆయన ఢీకొట్టిన వాహనం డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు కరుణరత్నెను అరెస్ట్ చేశారు. వారం రోజుల్లో పోలీసులు అతన్ని న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. కోర్టులో కనుక నేరం రుజువైతే కరుణరత్నె క్రికెట్ కెరీర్‌ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాగా, కరుణరత్నె కెప్టెన్సీలో ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో లంకేయులు అనూహ్య విజయాన్ని అందుకున్నారు. దీంతో లంక క్రికెట్ బోర్డు రాబోయే వరల్డ్ కప్ దృష్ట్యా వన్డే సారథ్య బాధ్యతలు కూడా కరుణరత్నెకు అప్పగించాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో ఈ సంఘటన జరగడం గమనార్హం.