ఏపీలో విడుదల కాకుండా అడ్డుకున్నది ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసు

SMTV Desk 2019-03-29 15:44:24  rgv , ntr,

లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పలు ఆటంకాలను అధిగమిస్తూ ఏపీ తప్ప ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలైంది. మొదటిరోజు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు.

కాగా.. ఈ సినిమా వివాదంపై దర్శకులు రామ్‌గోపాల్ వర్మ స్పందించారు. ఏపీలో విడుదల కాకుండా అడ్డుకున్నది ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసన్నారు వర్మ. తెర వెనుకాల ఏమి జరిగిందో కూడా తనకు తెలుసన్నారు. ఎన్టీఆర్ సింహగర్జనకు అనుమతి ఇవ్వకుండా మానసిక క్షోభకు గురి చేసిన వారే.. ఇప్పుడు సినిమా విడుదల కాకుండా అడ్డకుంటున్నారని ఆరోపించారు.

అయినా.. సినిమాను ఏపీలో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఒక్క సినిమా అనేది ఒక చోట విడుదలై.. మరో చోట విడుదల కాని సినిమా అంటే.. లక్ష్మీస్ ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు. అలాగే.. ప్రొడ్యూసర్‌‌కు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు వర్మ. అయితే.. తాను రాజకీయాల్లో ఎప్పుడు ఎంటర్ కాలేదని.. ఇప్పటి వరకు కూడా ఓటు వెయ్యలేదని వర్మ తెలిపారు