రాహుల్ పై విరుచుకుపడ్డ మమత

SMTV Desk 2019-03-29 13:17:29  mamata benerjee,

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. తమ ప్రభుత్వంపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై మమతా బెనర్జీ స్పందిస్తూ అతని వ్యాఖ్యలు చిన్నపిల్లాడి చేష్టల్లా ఉన్నాయని విమర్శించారు. అలాగే రాహుల్ విమర్శలను పట్టించుకోవడం లేదని దీదీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తమ పార్టీ బీజేపీతో ఈ ఎన్నికల్లో నువ్వా నేనా అనే రీతిలో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉందని, అలాంటి సమయంలో రాహుల్ లాంటి వారు మధ్యలో దూరితే ఎవరూ పట్టించుకోరని టీఎంసీ పార్టీ నేతలు పార్థ చటర్జీ, ఫిర్హద్ హకీమ్ ఎద్దేవా చేశారు.

ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ, టీఎంసీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మమతా బెనర్జీ పాలన ఏకపక్షంగా సాగుతోందని, అన్ని అధికారాలు ఆవిడ చేతిలోనే ఉంచుకొని కేబినెట్ మంత్రులను డమ్మీలుగా చేసేశారని మమతా బెనర్జీ విమర్శించారు. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ తిరుగులేని శక్తిగా అవతరిస్తే, వామపక్షాలతో జతకట్టి బరిలోకి దిగిన కాంగ్రెస్ గతంలో కన్నా తన పరిస్థిితి మెరుగుపరుచుకొని 42 స్థానాలతో రెండోస్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని సీట్లు అయినా తన ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ ఊవిళ్లూరుతోంది.