'చోటీ చోటీ బాతే.. మీఠీ మీఠీ యాదే'

SMTV Desk 2019-03-29 10:51:16  choti choti baate, meeti meeti

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న మహర్షి సినిమాలోని తొలి పాట వచ్చేసింది. చోటీ చోటీ బాతే.. మీఠీ మీఠీ యాదే అంటూ సాగుతున్న ఈ పాట ఆకట్టుకుంటోంది. ఈరోజు నుంచి మహర్షి మ్యూజికల్‌ జర్నీ షురూ అవుతుందని చిత్రబృందం ఇటీవల ప్రకటించింది. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటించారు. అల్లరి నరేశ్‌ కీలక పాత్ర పోషించారు. ముగ్గురు స్నేహితుల మధ్య చోటుచేసుకున్న సన్నివేశాల ఆధారంగా సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ఈ పాటను దేవిశ్రీ ప్రసాదే ఆలపించారు. మే 9న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.