‘విక్కీతో’ డేటింగ్ కి రెడీ అంటున్న తమన్న

SMTV Desk 2019-03-28 12:36:22  tammanh, uri actor

‘ఉరీ: ద సర్జికల్ స్ట్రైక్’ బాలీవుడ్ సినిమా హీరో విక్కీ కౌశల్ ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిగ్గా మారాడు. ఈ చిత్రంలో సైనికుడిగా విక్కీ ఖతర్నాక్ పర్మాఫెన్సుకు ప్రేక్షుకలే కాదు, హీరోయిన్లు కూడా ఫిదా అయ్యారు. అతని కలసి ఒక్క సినిమా అయినా చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. విక్కీతో సినిమా ఏం ఖర్మ, ఏకంగా డేటింగ్, రొమాన్సుకు కూడా సిద్ధమని పలువురు కథానాయికలు చెప్పారు. కత్రికా కైఫ్ కూడా మనసు పారేసుకుంది. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా సాహో విక్కీ అనేసింది.

మీకు డేటింగ్ చేయాలనిపిస్తే ఎవరితో చేస్తారని తమన్నాను ఓ విలేకరి అడగ్గా, ‘విక్కీతో’ అని టక్కున చెప్పేసింది.‘ఉరీ: ది సర్జికల్‌ స్ట్రయిక్‌’ చిత్రంలో అతడు చెలరేగిపోయాడని, అతనిపై ఇష్టం ఏర్పడిందని చెప్పుకొచ్చింది. మీటూ ఉద్యమంపై స్పందించాలని అడగ్గా, అలా ముందుకొస్తున్న అమ్మాయిలు చాలా ధైర్యవంతులని పేర్కొంది.