మెగా పవర్ స్టార్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన అమితాబ్..!

SMTV Desk 2019-03-28 11:11:48  ram charan , amitabh

మెగా పవర్ స్టార్ రాం చరణ్ పుట్టినరోజు సందర్భంగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ సర్ ప్రైజ్ వీడియో మెసేజ్ పంపించారు. మెగా వారసుడిగా రాం చరణ్ చిరుత సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సినిమా సినిమాకు నటనలో పరిణితి చెందుతూ రంగస్థలంతో విమర్శకులను సైతం ముక్కున వేలేసుకునేలా చేసిన రాం చరణ్ ప్రస్తుతం రాజమౌళి డైరక్షన్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు.

ఈ బర్త్ డే సందర్భంగా అమితాబ్.. మార్చ్ 27 నీ పుట్టిన రోజు. ఈరోజు.. రేపు.. నీ ఫ్యూచర్ కు అల్ ది బెస్ట్ చెబుతున్నా. నీకు మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. నువ్వు ఒక వండర్ ఫుల్ పర్సన్ చరణ్. నీకు ఇప్పుడు ఎన్నోళ్లు వచ్చాయో నాకు తెలీదు. నిన్ను ఎప్పుడు చూసిన 18 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తావు. చివరిగా చరణ్ హ్యాపీ బర్త్ డే అన్నది మాత్రం తెలుగులో చెప్పాడు అమితాబ్.