ప్యాంట్ జేబులో బాంబులా పేలిన ఒప్పో ఫోన్

SMTV Desk 2019-03-27 11:04:11  oppo

చైనా సెల్‌ఫోన్ బాంబులా పేలింది. హైదరాబాద్‌ మచ్చబొల్లారానికి చెందిన ఇమ్రాన్ రెండు రోజుల క్రితం అల్వాల్‌లోని ఓ షోరూంలో ఫోన్ కొన్నాడు. ఎక్కువ ఫీచర్స్, తక్కువ కాస్ట్ కావడంతో ఓప్పో ఏ5 ఫోన్‌ను మోజుపడి కొనుక్కున్నాడు. కానీ.. అదే ఫోన్ అతని ప్యాంట్ జేబులో బాంబులా పేలింది.

హైదరాబాద్ మచ్చబొల్లారంలో ఉండే ఇమ్రాన్ తన కొత్త సెల్‌ఫోన్‌ను ప్యాంట్ జేబులో పెట్టుకుని చెల్లితో కలిసి బైక్‌పై బయటకు బయల్దేరాడు. బైక్ డ్రైవ్ చేస్తున్న సమయంలో తన జీన్స్ ప్యాంట్ లెఫ్ట్‌సైడ్ ప్యాకెట్‌లో నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. బైక్ ఆపి ఫోన్ బయటికి తీసేలోపే అది బ్లాస్ట్ అయ్యింది. సెల్‌ఫోన్ పేలుడు వల్ల బాధితుడు ఇమ్రాన్‌కు ముఖం, తొడభాగంలో గాయాలు అయ్యాయి. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.