పుచ్చకాయ వల్ల అద్భుత లాభాలు..

SMTV Desk 2019-03-27 10:56:03  water melon,

పుచ్చకాయ వల్ల కలిగే లాభాలు..

పుచ్చకాయలో అధికంగా నీరు వుంటుంది. మూత్రం సరిగా రానివారు, మూత్ర విసర్జనలో మంట ఉన్నవారు ఈ పండు తింటే ఫలితం వుంటుంది.


పుచ్చపండు గింజలు యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా, ఈ విత్తనాలను తీసుకోవటం వలన చర్మ క్యాన్సర్ మరియు ఇన్ఫెక్షన్ వంటి చర్మ రుగ్మతలు రావు.


ఎండలో బయటకు వెళ్లినప్పుడు పుచ్చకాయ ముక్కలు తింటే వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. దీన్ని తినడం వల్ల మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాకుండా జీర్ణశక్తిని మెరుగుపరిచే శక్తి పుచ్చకాయకు ఉంది.


ఈ గింజలలో ఉండే కాపర్ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. కాబట్టి పుచ్చకాయ తినేటప్పుడు గింజల్ని కూడా తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.ఈ విత్తనాలలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, పాస్పరస్, సోడియం, మాంగనీస్, జింక్‌లతో పాటు విటమిన్స్, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, అమీనో ఆమ్లాలు లభిస్తాయి. అలాగే పుచ్చకాయలో బి, సి విటమిన్లు, బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి.


అతిదాహం, చెమట ద్వారా వెళ్లిపోయే ఖనిజ లవణాల లోపాలను పుచ్చకాయ తగ్గిస్తుంది. జ్వరంతో బాధపడతున్నవారు పుచ్చకాయ రసంలో తేనె కలిపి సేవిస్తే శారీరక నీరసం తగ్గి శక్తి వస్తుంది.


పుచ్చకాయలోని సిట్రులైన్, ఆర్గినైన్ పదార్దాల వలన మగవారిలో అంగస్తంభన సమస్య తగ్గుతుంది. ఇది ఒక నేచేరల్ వయాగ్రాలా పనిచేస్తుంది.


మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజూ పుచ్చకాయ తింటే ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎండిపోయే పెదవులను తడిగా ఉంచుతుంది.